నా ఓటమికి రామోజీ కుట్ర: ఉండవల్లి
ఏలూరు: తన ఓటమికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఈనాడు రామోజీరావు పెద్దఎత్తున కుట్ర పన్నారని రాజమం డ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని గురువారం ఆయన సతీసమేతం గా దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తనను ఓడించాలని టీడీపీ డబ్బు విచ్చలవిడిగా పంపిణీ చేయగా, రామోజీరావు ఈ డబ్బు పంపిణీలో కీలకపాత్ర వహించారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. వారిద్దరి అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెచ్చినందుకే ప్రజలు తనను గెలిపించారని ఉండవల్లి చెప్పారు. మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నారా అన్న ప్రశ్నకు తనకు ఏ శాఖను కేటాయించినా సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.












Click it and Unblock the Notifications