రాష్ట్రం ఇంకా గరం గరం

విశాఖపట్నం: రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. అయినా హైదరాబాద్ లో పగటి ఉష్ణోగ్రత తగ్గలేదు. రాయలసీమను తాకిన రుతుపవవాల ప్రభావం రాష్ట్రం మంతటా వ్యాపించడానికి మరికొన్ని గంటలు పట్టవచ్చు. పశ్చిమబెంగాల్‌ లోని సాగర్‌ వద్ద నిన్న సాయంత్రం తీరాన్ని దాటిన ఐలా తుఫాను పశ్చిమబెంగాల్‌ ను కుదిపివేసింది. ఈరోజు ఇది బలహీనపడి వాయుగుండంగా మారుతోందని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలియజేసింది. దీంతో బెంగాల్‌, సిక్కం, మేఘాలయ, ఒరిస్సాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులకు కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. అయితే మన రాష్ట్రంలో మాత్రం రాయలసీమపై కొంత ప్రభావం ఉంటుంది తప్ప మిగతా రాష్ట్రమంతటా అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణశాఖ తెలిపింది. కోస్తా ఆంధ్ర, తెలంగాణాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+