ఒక్క నెలలో సిడ్నీలో 20 దాడులు

సిడ్నీ: గత నెల రోజుల్లో సిడ్నీలో భారతీయులపై జాతి వివక్షకు సంబంధించిన సంఘటనలు 20 దాకా చోటు చేసుకున్నాయి. అయితే భయం వల్ల చాలా సంఘటనలు వెలుగు చూడడం లేదని కార్డియాలిజిస్టు యదు సింగ్ అంటున్నారు. సిడ్నీలో భారత ప్రజలపై దాడులు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. గత 12 నెలల కాలంలో వందకు పైగా సంఘటనలు చోటు చేసుకున్నాయని యదు సింగ్ చెప్పినట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రిక రాసింది.

శాశ్వత నివాసిత అవకాశాన్ని కోల్పోతామనే భయంతో చాలా మంది విద్యార్థులు తమపై దాడులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని ఆయన చెప్పారు. ఆస్ట్రేలియాలోని విద్యార్థుల సంక్షేమాన్ని చూడడానికి సిడ్నీలోని భారత కాన్సులేట్ ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. యదు సింగ్ ఆ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు.

మెల్బోర్న్ చాలా సమస్యగా తయారైందని, సిడ్నీలో ఏదో ఒకటి చేయకపోతే పునరావృతం అవుతుందని ఆయన అన్నారు. పశ్చిమ సిడ్నీలో భారత విద్యార్థులపై రాత్రి వేళల్లో గాక పగటి పూట కూడా రైళ్లలో, ఇళ్ల వద్ద దోపిడీకి పాల్పపడడం, వారి పట్ల దురుసుగా ప్రవర్తించడం వంటి సంఘటనల ఊహాగానాలు వింటూనే ఉంటామని ఆయన అన్నారు. లక్ష్యం చేసుకునే భారత విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. అటువంటి సంఘటనలను కొన్నింటిని ఆయన ఉదాహరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+