సత్యం సిబ్బంది కోతకు ప్లాన్

రాబడిని అధికం చేసి చూపించడానికి పాత చైర్మన్ రామలింగరాజు అవసరానికి మించి ఉద్యోగులను తీసుకున్నారని, ఇప్పుడు ఆ కేటగిరీకి చెందిన వారినే ఉద్యోగాల నుంచి తొలగించాలని టెక్ మహీంద్రా భావిస్తోంది. అయితే ఉద్యోగాలు కోల్పోయిన వారికి కొత్తగా వేరే సంస్థలో ఉద్యోగ అవకాశాలకోసం డజను ఔట్‌ప్లేస్ మెంట్ సంస్థలతో కంపెనీ చర్చిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సత్యంలో 42 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. తాజాగా 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తే వీరి సంఖ్య 32 వేలకు చేరుతుంది. దీని వల్ల కంపెనీపై భారం తగ్గుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications