లాహోర్: క్రితం సంవత్సరం నవంబర్ 26న ముంబాయిలో మారణహోమంకి సూత్రారిగా బావిస్తున్న వ్యక్తికి లాహోర్ హైకోర్టు అనుకూలంగా తీర్పు చెప్పింది. 26/11 దాడుల కేసుల్లో ప్రధాన నిందితుడు జమాత్ ఉద్ దవా నేత హాఫీజ్ సయిద్ గృహ నిర్భంధాన్ని ఎత్తి వేయాలని లాహోర్ హైకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. హాఫ్‌జ్ తరఫు న్యాయవాది ఇచ్చిన హెబియస్ కార్పస్ రిట్ ఆధారంగా సయీద్, నజీర్ అహ్మద్ లు విడుదల చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. అయితే సయీద్ ను భారత్ అప్పగించాలన్న డిమాండ్ ను పాక్ తోసిపుచ్చింది.