వైయస్..సువార్త సభల్లో

జెరూసలెం వెళ్లి వచ్చినంత మాత్రాన వర్షాలు కురిసేటట్లయితే...పాలస్తీనా, ఇథియోపియా, ఇజ్రాయెల్ వంటి క్రైస్తవ దేశాల్లో కరువు ఎందుకు ఉందని విశ్వహిందూ పరిషత్ ముఖ్యమంత్రి వైఎస్ ను సూటిగా ప్రశ్నించింది. కరువు కారణంగా జెరూసలెం ఎడారిగా మారిందని, వ్యవసాయానికి నీళ్లు సరిపోక అక్కడ బిందుసేద్యం చేస్తున్నారని, ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకుంటున్నారని గుర్తు చేసింది. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
ప్రభుత్వాధినేత అయివుండి తన మత భావాలను ప్రజల మీద రుద్ది క్రైస్తవ మత ప్రచారం చేయడం శోచనీయమన్నారు. వైఎస్ ప్రకటనే నిజమైతే వందల కోట్ల రూపాయల ఖర్చుతో మేఘమథనం చేపట్టి కృత్రిమ వర్షాలు కురిపించే ప్రయత్నం ఎందుకు చేశారని నిలదీశారు. మెజార్టీగా ఉన్న హిందువుల విశ్వాసాలను గాయపరిచే విధానాలు మానుకోవాలని హితవుపలికారు.












Click it and Unblock the Notifications