వాషింగ్టన్: అమెరికన్లు భారత్ వెళితే ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉండవచ్చని ఆ దేశాధ్యక్షుడు ఒబామా హెచ్చరించారు. కనక భారత్ వెళ్ళే అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే మినహా భారత్ కు వెళ్ళకపోవడమే మంచిదన్న అభిప్రాయాన్నీ ఆయన వ్యక్తం చేశారు. భారత్ పై వ్యూహాత్మక దాడులకు యత్నిస్తున్న లష్కర్-ఇ-తొయిబా ఉగ్రవాద సంస్థ ఇక్కడకు విహారార్థం వచ్చిన అమెరికన్లను టార్గెట్ గా చేసుకుంటోందన్న సమాచారం తమ వద్ద ఉన్నదని ఒబామా వెల్లడించారు. ఈ ప్రకటనకు భారత్ వెంటనే స్పందించింది. భారత్ లో పర్యటించే అమెరికన్ల రక్షణకు ఎలాంటి ఢోకా లేదని హోం శాఖ మంత్రి చిదంబరం ప్రకటించారు.