హైదరాబాద్: అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు గౌరవంగా ప్రవర్తించాలని జేపీ పిలుపునిచ్చారు. బయట ఉన్న రాగ ద్వేషాలను విడనాడి ఇక్కడ హుందాగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేద్దామని కోరారు. ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన మొట్టమొదటిసారిగా ప్రసంగించారు. డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన శుభాకాంక్షలు తెలిపారు.