హైదరాబాద్: తాము కాంగ్రెస్ కు అనుకూలమని వస్తున్న సంకేతాలను ప్రజారాజ్యం గురువారం ఖండించింది. స్పీకర్ పదవికి కిరణ్ కుమార్ రెడ్డిని ప్రతిపాదించినంత మాత్రాన తాము కాంగ్రెస్ పార్టీకి అనుకూలం కాదని ప్రజారాజ్యం స్పష్టం చేసింది. ఆ పార్టీ ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాస్ మాట్లాడుతూ..నిబంధనల ప్రకారం స్పీకర్ పదవిని అధికార పక్షమే చేపట్టాలని అందుకే తమ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి మద్దతు తెలిపారన్నారు. ప్రభుత్వం చేసే మంచి పనులకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని, లోపాలుంటే ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడతామని ఆయన తెలిపారు. సభా కార్యక్రమాల్లో గౌరవంగా, హుందాగా ఉంటామని స్పష్టం చేశారు.