హైదరాబాద్: స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డంటే తమకేమీ వ్యతిరేకత లేదని తెలుగుదేశం పార్టీఅధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. స్పీకర్ గా కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ప్రకటించినప్పుడు ఆలోచించి చెబుతామన్నామని అంతేగాని ఆయనంటే మాకు ఇష్టం లేదని చెప్పలేదన్నారు. సభ ప్రారంభమైన రోజునే రోశయ్యగారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
గతంలో చీఫ్ విప్ గా కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ తరఫున ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. అందువల్ల స్పీకర్ గా కిరణ్ కుమార్ రెడ్డి నిస్పాక్షికంగా వ్యవహరించలేరని తెలుగుదేశం నాయకులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు.