నోట్లో విషం పోయాలి: నన్నపనేని

విజయవాడ: శరద్‌యాదవ్‌ విషం తీసుకోవడం కాదు, పార్లమెంటులోని మహిళలే ఆయనకు బలవంతంగా నోట్లో విషం పోయాలని వ్యాఖ్యానించారు. మహిళా ఎంపీలు తాము కూడా వి షం తాగుతామంటే అప్పుడేం చేస్తారని తెలుగుదేశం పార్టీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి ప్రశ్నించారు. దేశంలో మహిళా ఓటర్లు 52 శాతం ఉన్నారని చెబుతూ, చట్ట సభలకు ఎన్నిక కావడం మహిళల జన్మహ క్కు, ఎవరో ఇవ్వడం, తాము తీసుకోవడం కుదరదని అన్నారు.శనివారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

మహిళల్ని రాజకీయం గా అణగదొక్కేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చే శారు. ఎన్నికల్లో గెలిచేందుకు మాత్రం వీరికి మహిళల ఓట్లు కావాలని అన్నారు. మరో ఎంపీ లాలూప్రసాద్‌ యాదవ్‌ కూడా బిల్లును వ్యతిరేకిస్తున్నారని, తన అవసరార్థం భార్యను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండుసార్లు మహిళాబిల్లుకు అనుకూలంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్లు గుర్తు చేశారు. బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు. బిల్లు ఆమోదం కోసం కృషిచేస్తున్న ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా, రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌లకు ధన్యవాదాలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+