భారత విద్యార్థిపై మరో దాడి
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో భారత విద్యార్థిపై తాజాగా మరో దాడి జరిగింది. నెల రోజుల వ్యవధిలో ఇలాంటి దాడి జరగడం ఇది పదకొండోసారి. మెల్బోర్న్ లోని పశ్చిమ శివారులో కమల్ జిత్ అనే విద్యార్థి గాయాలతో రక్తమోడుతూ స్పృహ కోల్పోయి పడి ఉండడాన్ని మరో భారతీయ విద్యార్థి గమనించాడు. రెండో వారాల వ్యవధిలో జిత్ పై దాడి జరగడం ఇది రెండో సారి.
పలువురు మాస్కులు ధరించిన వ్యక్తులు ఇంతకు ముందు జిత్ పై కోడి గుడ్లతో దాడి చేశారు. అల్బాన్స్ స్టేషనులో రాత్రి పూట రైలు దిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. దేశానికి, కుటుంబాలకు దూరంగా ఉంటున్న తమపై దాడి జరగడం దారుణమని జిత్ ది ఏజ్ పత్రికతో జిత్ సోమవారం అన్నారు.
ఆదివారం తెల్లవారు జామున ఒంటి గంటా 40 నిమిషాల ప్రాంతంలో ఇంటికి వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు కారులో అనుమానస్పదంగా కనిపించారని, వారిని తప్పించుకోవడానికి తాను ప్రయత్నించానని వారు సమీపంలోని పిజ్జా షాపు నుంచి వచ్చినట్లు గమనించానని జిత్ చెప్పారు. ఒక వ్యక్తి కారు వద్ద నిలిచి ఉన్నాడని, ఇద్దరు తన వద్దకు వచ్చారని, తలపై ఉక్కు రాడ్ తో బలంగా కొట్టారని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications