పిఎస్ ను పేల్చేసిన మావోయిస్టులు
భువనేశ్వర్: మావోయిస్టులు ఒరిస్సాలో పోలీసులను బయటకు పంపించి పోలీసు స్ఠేషన్ ను పేల్చి వేశారు. పలు వాహనాలకు నిప్పంటించారు.ట ఈ సంఘటన ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లా బైపారిగుడా గ్రామంలో జరిగినట్లు పోలీసులు సోమవారం ఉదయం చెప్పారు. ఆ సమయంలో ఐదుగురు పోలీసులు విధుల్లో ఉన్నారు. దాదాపు 70 మంది నక్సల్స్ పోలీసు స్టేషన్ పై దాడి చేశారు.
పోలీసులను బలవంతంగా బయటకు పంపించి నక్సల్స్ పోలీసు స్టేషనును పేల్పివేసినట్లు పోలీసు డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ సంజీవ్ పాండా మీడియా ప్రతినిధులతో చెప్పారు. సమీపంలోని పోలీసు అవుట్ పోస్టును కూడా నక్సల్స్ పేల్చివేశారు. స్థానిక అటవీ శాఖ కార్యాలయంలోని పలు వాహనాలకు నిప్పంటించారు. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు. ఆ తర్వాత మావోయిస్టులు సమీపంలోని అడవుల్లోకి పారిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో తమ నాయకుడు పటేల్ సుధాకర్ రెడ్డి ఎన్ కౌంటర్ కు నిరసనగా మావోయిస్టులు ఈ చర్యకు దిగినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications