వ్యక్తి మృతి: బస్సులపై దాడి
నూజివీడు: కృష్ణా జిల్లా నూజివీడులో బస్టాండు వద్ద ఆర్టీసీ బస్సుల మధ్య నలిగి మంగళవారం ఓ వ్యక్తి మృతి చెందాడు. రామన్నగూడెంకు చెందిన వేల్పుల వెంటేశ్వరరావు అనే వ్యక్తి బస్టాండులో బస్సు కోసం వెళుతుండగా రెండు బస్సులు వేగంగా రావటంతో వాటి మధ్య ఇరుక్కుని అతను మృతి చెందాడు.
తమకు న్యాయం చేయాలని మృతుని బంధువులు ఆర్టీసీ అధికారులను కోరారు.ఆర్టీసి అధికారులు స్పందించకపోవటంతో ఆగ్రహం చెందిన స్థానికులు ఆందోళనకు దిగారు. బస్టాండులో ఉన్న 17 బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. రాస్తారోకోకు దిగారు. ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.












Click it and Unblock the Notifications