విమానం కూలి 14 మంది మృతి
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ లో విమానం కూలి 14 మంది మృతి చెందారు. సైన్యానికి చెందిన రవాణావిమానం ఏఎన్ 32 అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వెళుతుండగా మధ్యలో అదృశ్యమైంది. ఇది కూలిపోయినట్లు భావిస్తున్నారు. ఇందులోని 8 మంది వైమానిక సిబ్బంది, 6గురు సైనికులు మృతి చెందినట్లు భావిస్తున్నారు.
అరుణాచల్ ప్రదేశ్ లోని మచుకా సమీపంలో ఈ విమానం కూలింది. విమానం అదృశ్యమైందని, దాని కోసం అన్వేషణ సాగుతోందని, ఇప్పుడే ఏమీ చెప్పలేనని ఢిల్లీలో గల ఎయిర్ హెడ్ క్వార్టర్స్ లోని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. వాతావరణం సరిగా లేకపోవడం వల్లనే విమానం కూలినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications