స్వైన్ ఫ్లూపై ఆందోళన వద్దు: ఆజాద్

వ్యాధి బయటపడిన రోజు నుంచే తాము చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. వ్యాధి వంద శాతం నయమవుతుందని ఆయన చెప్పారు. దేశంలో 15 కేసులు మాత్రమే నమోదయ్యాయని, ఇప్పటికే ఐదుగురు డిశ్చార్జీ అయ్యారని ఆయన చెప్పారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
అన్ని కేసులు కూడా అమెరికా నుంచి వచ్చినవారి నుంచే నమోదయ్యాయని, ఇది దేశంలో పుట్టింది కాదని ఆయన చెప్పారు. జిల్లా స్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆయన చెప్పారు. జాతీయ స్థాయిలో వైద్యులు, శాస్త్రవేత్తలతో ర్యాపిడ్ రెస్పాన్స్ టీం ఉందని, రాష్ట్రాల స్థాయిలో కూడా వాటిని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications