చంద్రబాబే ముంచారు: నారాయణ

'కూటమి ఓటమికి చంద్రబాబుదే బాధ్యత. ఆ పార్టీ ఓడిపోవడంతో బాటు మమ్మల్ని భ్రష్టు పట్టించాడు' అన్నారు. 'కేసీఆర్ కు శక్తికి మించి సీట్లిచ్చారు. అభ్యర్థులను సరిగా పెట్టుకోలేదు. నమ్ముకున్న తెలంగాణా ప్రజల్ని అమ్ముకోడానికి ప్రయత్నం చేశాడు. అందుకే అనుభవిస్తున్నాడు. పుట్టుకతో వచ్చిన విద్య అతనిది. మారతానంటే ఎవరూ నమ్మరు. తెలంగాణా వాదన ఎవరబ్బ సొత్తుకాదు. అన్ని రాజకీయపార్టీల సొత్తు. తెలంగాణా ప్రజల వాదన, వారి సమస్యలే మాకు ముఖ్యం' అన్నారు.
శాసనసభలో తెరాసా, కేసీఆర్ లపై వైఎస్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా 'అప్పట్లో కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడాడు. శాసనసభను వేదికగా చేసుకుని వైఎస్ వాటికి సమాధానాలిచ్చారు. దానికీ తెలంగాణాకు సంబంధం లేదు. ఆ వ్యాఖ్యలు కేసీఆర్, వైఎస్‌ల మధ్య ఉన్న విధ్వేషాలను బయట పెడుతున్నాయి' అన్నారు. సీపీఐతో వివాదాలున్నా కలసి పనిచేస్తామని సిపిఎం రాష్ట కార్యదర్శి రాఘవులు చేసిన వ్యాఖ్యలపైనా నారాయణ ఘాటుగా స్పందించారు. 'ఈ వ్యాఖ్యలు వామపక్ష కార్యకర్తలను సంతృప్తి పరచడానికి ఉపయోగ పడతాయి. వాస్తవానికి మమ్మల్ని అవమానించారు. ఓడించారు. ఓడించిన దానిపై చర్చ జరగాలి. తప్పు తేలాలి. వాళ్లు ఎక్కడ తప్పుచేశారో తెలుసుకోవాలి. ఎవరు ఎవరిని మోసం చేశారో సమీక్ష జరగాలి. అప్పుడే కలసి పనిచేస్తాం'అని అన్నారు.












Click it and Unblock the Notifications