సిఎంను కలిసిన ఎమ్మార్పీస్ నేతలు
హైదరాబాద్: ఎస్సీల వర్గీకరణపై వెంటనే చర్యలు చేపట్టాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ముఖ్యమంత్రిని కోరింది. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రమాదిగ ఆధ్వర్యంలో న్యాయ సలహాదారుల కమిటీ సభ్యులు, మేధావులు కలిసి సీఎంకు వినతిపత్రం అందజేశారు.
మాదిగల సహకారంవల్లే కాంగ్రెస్ ఘనవిజయం సాధించిందని వారు అన్నారు. వర్గీకరణ అంశం కాంగ్రెస్ మానిఫెస్టోలో ఉంచినందున మాదిగలకు న్యాయం చేయాలని కోరారు. రానున్న లోక్ సభ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని అనంతరం సురేంద్రమాదిగ తెలిపారు.












Click it and Unblock the Notifications