ముంబయి: పనిమనిషిపై అత్యాచారం చేసినట్లు బాలీవుడ్ వర్ధమాన నటుడు షైనీ అహుజా అంగీకరించాడు. బాధితురాలికి ఏవిధమైన సాయం చేసేందుకైనా తాను చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అతను బుధవారం తెలిపాడు. పనిమనిషికి నిర్వహించిన వైద్యపరీక్షల్లో లైంగిక దాడి జరిగిందని ఇప్పటికే పోలీసు వర్గాలు తెలిపాయి. అహుజా తనపై అత్యాచారానికి పాల్పడినట్లు పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అతన్ని సోమవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.