మొద్దుశీనే చేశాడు: టీవీ9 రవి ప్రకాష్

Ravi Prakash
అనంతపురం: పరిటాల రవీంద్రను తానే హత్య చేశానంటూ..మొద్దుశీను ఇచ్చిన ఇంటర్వ్యూ క్యాసెట్టును ధ్రువీకరించేందుకు టీవీ9 ఛానల్‌ సీఈఓ వి.రవిబాబు అలియాస్‌ రవిప్రకాష్‌ మంగళవారం అనంతపురం కోర్టు ఎదుట హాజరయ్యారు. ప్రాసిక్యూషన్‌ తరపున సాక్ష్యం చెప్పారు. "ఫోన్‌ లో ఇంటర్వ్యూ ఇస్తానని మా క్రైం రిపోర్టర్‌ మురళికి మొద్దుశీను ఫోన్‌ చేశాడు. ఈ విషయాన్ని రిపోర్టర్‌ నా దృష్టికి తెచ్చాడు. అప్పుడే నేను మొద్దు శీనుతో ఫోన్‌ లో మాట్లాడా. ఆయన కడపలో ఉన్నానని చెప్పాడు. నా సూచన మేరకు కడప రిపోర్టర్‌ సదాశివారెడ్డి మొద్దుశీనుతో ఇంటర్వ్యూ చేసి రికార్డును పంపించారు. దీన్ని 2005 జనవరి 30న మా ఛానల్‌ లో ప్రసారం చేశాం" అని రవిప్రకాష్‌ కోర్టులో వివరించారు.

ఆ క్యాసెట్టు ఇదేనా..అని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మినీ డీవీ కెమెరాలో ప్రదర్శించి రవిప్రకాష్‌ కు చూపించారు. దానిని ఆయన ధ్రువీకరించారు. ఇంటర్వ్యూ ప్రసారమైన రోజు(2005 జనవరి 30) సదరు క్యాసెట్టును అందుకోలేదని, చిత్తూరు నుంచి నెట్‌ద్వారా డిజిటల్‌ రూపంలో తమ స్టూడియోకు చేరిన దృశ్యాన్ని ప్రసారం చేశామని, రవిప్రకాష్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌లో తెలిపారు. ప్రసారం చేసిన తర్వాతే క్యాసెట్టు తమకు అందిందన్నారు. అనంతరం కేసును ఈ నెల 19కి కోర్టు వాయిదా వేసింది. ఈ గడువులోగా మరో సాక్షిగా ఉన్న అప్పటి టీవీ9 కడప రిపోర్టర్‌ సదాశివారెడ్డిని తమ ముందు హాజరు పరచాలని కోర్టు ప్రాసిక్యూషన్‌ను ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+