కొత్త రక్తం కావాలి: వైఎస్
హైదరాబాద్: పార్టీకి కొత్త రక్తం కావాలని ముఖ్యమంత్రి వెఎస్ పిలుపు ఇచ్చారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన 'జయహో' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ రెండవ సారి అధికారంలోకి రావడంలో యువత పాత్ర ప్రముఖమైనదని కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికలలో యువతకు ప్రాధాన్యత ఇస్తామని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ మాట్లాడుతూ పార్టీలో యువజన కాంగ్రెస్ కార్యకర్తల బాధ్యత ఎంతో ఉంటుందని, పార్టీని గెలిపించడంలో వారి పాత్రను ఆయన కొనియాడారు. యూపీలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడానికి రాహుల్ గాంధీ నాయకత్వమే కారణమని అన్నారు. యూత్ కాంగ్రెస్‌కు రాహుల్ కొత్త ఒరవడి తీసుకొస్తారని వైఎస్ ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వెఎస్ రాజశేఖరరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, హోం మంత్రి సబితారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications