ఆసీస్ లో హైదరాబాదీపై దాడి
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో భారత విద్యార్థిపై మెల్బోర్న్ లో దాడి జరిగింది. హైదరాబాదులోని పాతబస్తీకి చెందిన ఎంకెఎ ఖాన్ అనే విద్యార్థిపై దుండగులు దాడి చేశారు. నలుగురైదుగురు దుండగులు జనం మధ్యనే అందరూ చూస్తుండగా దాడి చేశారు. మెల్బోర్న్ లోని ఒక హెయిర్ సెలూన్ వద్ద ఈ దాడి జరిగింది. దాడి చేసినవారు ఖాన్ నుంచి ఏ వస్తువులు కూడా దొంగిలించలేదు. గాయపడిన ఖాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.












Click it and Unblock the Notifications