సరబ్ జిత్ మెర్సీ పిటిషన్ తిరస్కరణ
న్యూఢిల్లీ: భారత ఖైదీ సరబ్ జిత్ సింగ్ క్షమాభిక్ష రివ్యూ పిటిషన్ ను పాకిస్తాన్ సుప్రీంకోర్టు బుధవారంనాడు తిరస్కరించింది. 1990 లాహోర్ బాంబు పేలుళ్ల కేసులో సరబ్ జిత్ కు మరణ శిక్ష పడింది. సరబ్ జిత్ న్యాయవాది కేసును పట్టించుకోకపోవడంతో ముగ్గురు సభ్యులతో కూడిన పాకిస్తాన్ సుప్రీంకోర్టు బెంచ్ ఈ పిటిషన్ ను తిరస్కరించింది.
ఆదేశాలు జారీ చేసినప్పటికీ సరబ్ జిత్ తరఫు న్యాయవాది బుధవారం కోర్టుకు హాజరు కాలేదు. ఇంతకు ముందు సోమవారం జరిగిన విచారణకు కూడా అతను హాజరు కాలేదు. తనకు క్షమాభిక్ష పెట్టాలని సరబ్ జిత్ పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీకి విజ్జప్తి చేశారు. దానిపై జర్దారీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
సరబ్ జిత్ క్షమాభిక్ష విన్నపం పరిశీలనలో ఉందని పాకిస్తాన్ ఇంటీరియర్ మంత్రి చెప్పారు. సరబ్ జిత్ కు నిరుడు ఏప్రిల్ 1వ తేదీన ఉరిశిక్ష విధించాల్సి ఉంది. పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ జోక్యం చేసుకోవడంతో అది ఆగిపోయింది.












Click it and Unblock the Notifications