హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు తలసాని అల్టిమేటం

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణపై పార్టీ వైఖరిని మూడు రోజుల్లోగా మార్చుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు అల్టిమేటం ఇచ్చారు. తన మొర ఆలకించాలని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అనుకూల వైఖరి వల్ల పార్టీకి చాలా నష్టం జరిగిందని ఆయన అన్నారు. మూడు రోజుల లోగా నిర్ణయం తీసుకోకపోతే ఏం చేస్తారని అడిగితే ఆ తర్వాత ఆలోచిస్తానని ఆయన జవాబిచ్చారు. తెలంగాణవాదాన్ని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను ప్రజలు తిరస్కరించారని ఆయన అన్నారు. తెలంగాణపై ఇదే వైఖరితో ఉంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. పార్టీని బతికించండని పార్టీ నాయకులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ అనుకూల వైఖరి వల్ల తాము బలయ్యామని, మిగతా వారిని కూడా బలి చేయవద్దని ఆయన అన్నారు. పార్టీ తన వైఖరిని మార్చుకోవడంలో తప్పు లేదని ఆయన అన్నారు. ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన అన్నారు. తెలంగాణవాదం బలహీనపడిందని ఆయన అన్నారు. తెలంగాణ అనుకూల వైఖరిని వ్యతిరేకిస్తూ తాను గతంలోనే రాజీనామా చేశానని, దాన్ని తిరస్కరించారని, పార్టీకి నష్టం జరగకూడదని తాను ఆ విషయం వెల్లడించలేదని, తెలంగాణ సెంటిమెంట్ లేదని ఆనాడే చెప్పానని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు అందరి మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడారని ఆయన అన్నారు.

తనకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎంతో గౌరవించారని, పార్టీలో తనకు ఎంతో గౌరవం లభించిందని ఆయన అన్నారు. తాను మాట్లాడే విషయం వేరని, కాంగ్రెసు చేరే విషయం చర్చకు రాదని ఆయన అన్నారు. కాంగ్రెసులో చేరదలుచుకుంటే నేరుగా వెళ్లి చేరిపోయేవాడినని ఆయన అన్నారు. తాను సమైక్యవాదినని ఆయన చెప్పారు. తాను రాజకీయాల్లో ఎల్లకాలం ఉంటానని, తాను చేసేవాటికి సమాధానాలు తాను వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. వైయస్ పాలన ఎలా ఉందని అడిగితే మళ్లీ అటే లాగుతున్నారని, దాని వేరే ప్రెస్ మీట్ పెడతానని ఆయన చెప్పారు. తన పార్టీ గురించి మాట్లాడుతున్నానని, ఇతర పార్టీల గురించి ఎందుకు మాట్లాడుతానని ఆయన అన్నారు.

చంద్రబాబు నాయుడి వద్దకు వెళ్లడానికి తనకేమీ అడ్డంకులు లేవని, తన ఇంటికి వెళ్లడానికి తనకు ఆహ్వానాలేమిటని ఆయన అన్నారు. చంద్రబాబు నాయకత్వం బాగా లేదని తాను అనడం లేదని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీతోనే తనకు గుర్తింపు వచ్చిందని ఆయన చెప్పారు. వైయస్ అభివృద్ధిపై మరోసారి చెప్తానని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X