సంబర పడడం లేదు: డిఎస్

Srinivas
విజయవాడ‌: ఎన్నికల ఫలితాలకు సంబర పడడం లేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. ఫలితాలకు కాంగ్రెసు నాయకులు, కార్యకర్తలు సంబరపడాల్సిన అవసరం లేదని, ప్రజలు ఎన్నికల్లో గెలిపించి తమ గౌరవం కాపాడారని ఆయన అన్నారు. విజయవాడలో శుక్రవారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఫలితాలు అనుకున్నంతగా కాంగ్రెసుకు అనుకూలంగా రాలేదని ఆయన చెప్పారు. పొరపాట్లు ఎక్కడ జరిగాయో ఆలోచించి, విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

తమకు 185 శాసనసభా స్థానాలు వస్తాయని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గట్టిగా నమ్ముతూ వచ్చారని, అయితే 156 సీట్లు వచ్చాయని, తమ అంచనా తప్పడానికి పొరపాటు ఎక్కడ జరిగిందో గ్రహించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రజలకు తమ సందేశాన్ని సరిగా చేరవేయలేకపోయామని తాను అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వైయస్, డిఎస్ జోడీ రెండో సారి విజయం సాధించి చరిత్ర సృష్టించిందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+