డిఎస్ కొడుకు కళాశాలలో దారుణం
నిజామాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తనయుడు, మేయర్ సంజయ్ కు చెందిన శాంకరీ కళాశాలపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కళాశాలలో ఒక సైకో సహ విద్యార్థుల గొంతు కోసినట్లు ఆరోపణలు వచ్చాయి. అతను ముగ్గురి గొంతు కోసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన పది రోజుల క్రితం జరిగిందని సిపిఎం, ఎఐఎస్ ఎఫ్, పిడిఎస్ యు, ఎబివిపి ఆరోపిస్తున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే అంతు చూస్తామని బాధితులను కళాశాల యాజమాన్యం బెదిరించింది. సంజయ్ అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని సిపిఎం నాయకుడు వెంకటి, ఎఐఎస్ ఎఫ్ నాయకుడు రాజు గౌడ్ ఆరోపించారు.
కళాశాల యాజమాన్యం తీరుకు గతంలో ఒక అమ్మాయి ఆత్మాహత్యా యత్న చేసినట్లు కూడా వారు చెప్పారు. సంజయ్ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను భయాందోళనలకు గురి చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి చెందినవారు కావడంతో యాజమాన్యంపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications