ముప్పు ఉన్నట్లు కాదు: చిదంబరం

Chidambaram
హైదరాబాద్: ఎన్ ఎస్జీ హబ్ ను ఏర్పాటు చేస్తున్నామంటే ఉగ్రవాదుల ముప్పు ఉన్నట్లు కాదని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం అన్నారు. హైదరాబాద్ లో ఆయన బుధవారం ఉదయం ఎన్ ఎస్జీ హబ్ ను ప్రారంభించారు. చెన్నైలో ఇటువంటి హబ్ నే ప్రారంభించిన అనంతరం ఆయన హైదరాబాదు వచ్చారు. ఉగ్రవాదులను ఎదుర్కోవడానికే తాము ఈ ఎన్ ఎస్జీ హబ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇంటిలిజెన్స్ అందించే సమాచారం మేరకు ఉగ్రవాదుల కదలికలపై నిఘా వేయనున్నట్లు ఆయన తెలిపారు. ఉగ్రవాదుల నిర్మూలన కోసం ఎన్ ఎస్జీ హబ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎన్ ఎస్జీ హబ్ లో వైమానిక వ్యవస్థ ఉంటుందని ఆయన చెప్పారు. ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినప్పుడు సాధ్యమైనంత త్వరగా సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోకుండా ఉండడానికి ఈ హబ్ లు పనికి వస్తాయని ఆయన చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ప్రాంతీయ ఎన్ఎస్జీ హబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. హబ్ ఏర్పాటుకు అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంగళవారంనాడు చిదంబరం ముంబై ఎన్ ఎస్జీ హబ్ ను ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+