ప్రజా భద్రతా సలహా కమిటీకి కెవిపి

ప్రజల భద్రత, రక్షణ హోంశాఖ పరిధికి సంబంధించిన అంశాలు. వీటిపై సలహా కమిటీని వేస్తూ హోంమంత్రి సబితాఇంద్రారెడ్డికి ప్రాతినిధ్యం కల్పించకపోవడం ప్రభుత్వవర్గాల్లో చర్చనీయాంశం అయింది. డీజీపీ, ఇతర పోలీసు ముఖ్య అధికారులను సభ్యులుగా చేర్చి హోంమంత్రిని విస్మరించడం ద్వారా ఆమె ప్రాధాన్యాన్ని తగ్గించినట్లు అయింది. దేశంలోనే హోంశాఖను తొలిసారిగా మహిళకు ఇచ్చిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఇటీవల వార్తల్లో చోటుచేసుకుంది. ఇంతలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వంలో అత్యంత శక్తిమంతుడైన కెవీపీ రామచంద్రరావు ఈ కమిటీ ఛైర్మన్‌గా ఉండటంతో ప్రజల భద్రత, రక్షణకు సంబంధించిన అంశాలలో సహజంగానే కమిటీ అభిప్రాయాలే ప్రభుత్వంపై ప్రభావాన్ని చూపుతాయని, ఇది సబితా ఇంద్రారెడ్డి పాత్రను పరిమితం చేస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో కమిటీ పనితీరు ఎలా ఉండాలో కూడా మార్గదర్శకాలు పొందుపర్చింది.












Click it and Unblock the Notifications