మృతుల లెక్కలు తప్పు: ఆస్ట్రేలియా
న్యూఢిల్లీ: ఏడాది కాలంలో తమ దేశంలో మరణించిన 54 మందిలో సగం మంది భారతీయులేనని వచ్చిన వార్తలను ఆస్ట్రేలియా ప్రభుత్వం ఖండించింది. మృతులపై ప్రచురించిన వార్తా కథనంలోని లెక్కలు నిజం కావని స్పష్టం చేసింది. విదేశీ విద్యార్థుల రక్షణ కోసం ప్రభుత్వం త్వరితగతిన వరుసగా చర్యలు చేపడుతోందని ఆస్ట్రేలియా హై కమిషనర్ ఒక ప్రకటనలో చెప్పారు.
ఆస్ట్రేలియా వార్తా పత్రికల్లో ప్రచురించిన వార్తా కథనంలోనూ అంతర్జాతీయ విద్యార్థుల మృతిపై వచ్చిన వార్తా కథనంలోనూ నిజం లేదని హై కమిషనర్ అన్నారు. వార్తా కథనంలోని లెక్కలు ఫిబ్రవరిలో పార్లమెంటుకు ఇమిగ్రేషన్, సిటిజన్ షిప్ శాఖకు చెందినవని, అన్ని రకాల మృతుల సంఖ్యను అది తెలియజేస్తుందని, కేవలం దాడుల వల్ల మరణించిన వారి లెక్కలను మాత్రమే కాదని హై కమిషనర్ వివరించారు.












Click it and Unblock the Notifications