ఏ పిల్లా మచ్చ తెచ్చుకోదు: సబిత
హైదరాబాద్: ఏ ఆడపిల్ల కూడా కావాలని తన మీద మచ్చ వేసుకోదని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలుగుదేశం శాసనసభ్యుడు టీవీ రామారావుపై కేరళకు చెందిన నర్సింగ్ విద్యార్థులు ఫిర్యాదు చేసిన విషయంపై ఆమె శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఇక్కడ రామారావు ప్రధానం కాదని, నలుగురు విద్యార్థినుల భవిష్యత్తుకు సంబంధించిందని ఆమె అన్నారు. రామారావుపై కుట్ర చేయాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు.
వాస్తవాలు త్వరలో బయట పడతాయని ఆయన అన్నారు. డబ్బులిచ్చినంత మాత్రాన ఏ ఆడపిల్ల కూడా మచ్చను తన మీద వేసుకోదని, విద్యార్థినులు వారంతట వారే వచ్చారని ఆమె చెప్పారు. సిఐడి దర్యాప్తు చేస్తున్నందున వాస్తవాలు త్వరలోనే వెల్లడవుతాయని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications