వాస్తవంగా మంత్రి మాట్లాడలేదు: సిజెఐ
న్యూఢిల్లీ: వైద్య విద్యార్థి మార్కుల షీట్ల కుంభకోణం కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని వాస్తవంగా కేంద్ర మంత్రి తనతో మాట్లాడలేదని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఆర్ రఘుపతి చెప్పారు మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెఎల్ గోఖలేకు ఈ మేరకు ఆయన ఒక లేఖ రాశారు. ఇదే విషయాన్ని గోఖలే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కెజి బాలకృష్ణన్ కు తెలియజేశారు. మార్కుల షీట్ కుంభకోణం కేసులో కిరుబు శ్రీధర్ కు, అతని తండ్రి సి కృష్ణమూర్తికి బెయిల్ మంజూరు చేయాలని ఒక కేంద్ర మంత్రి తనపై ఒత్తిడి తెచ్చారని రఘుపతి సంచలన వ్యాఖ్య చేసిన విషయం తెలిసిందే.
నిందితుల తరఫు న్యాయవాది ఫోన్ చేసి కేంద్ర మంత్రి లైన్ లో ఉన్నారని, ఇద్దరు నిందితులకు బెయిల్ ముంజూరు విషయంపై మాట్లాడ్తారని చెప్పారని రఘుపతి ఆ లేఖలో చెప్పారు. రఘుపతి కేంద్ర మంత్రితో మాట్లాడడానికి నిరాకరించారని, అందువల్ల కేంద్ర మంత్రితో రఘుపతి వాస్తవంగా మాట్లాడలేదని భారత ప్రధాన న్యాయమూర్తి వర్గాలంటున్నాయి.












Click it and Unblock the Notifications