మమతపై ఆంధ్ర ఎంపీల పోరు
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి అరకొర కేటాయింపులపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు మంగళవారం రైల్వే మంత్రి మమతాబెనర్జీతో సమావేశమవుతున్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వారు మంత్రికి వివరించనున్నారు. మంత్రి దృష్టికి తీసుకువెళ్లాల్సిన అంశాలపై సోమవారం ఎపీ భవన్‌లో ఎంపీలు సమావేశమై చర్చించారు. పలు పెండింగ్ ప్రాజెక్టుల విస్మరణపై మంత్రికి ఫిర్యాదు చేయాలని వారు నిర్ణయించారు.
వరుసగా రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు అంటున్నారు. అవసరమైతే ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను, యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీని కలుస్తామని కూడా వారు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications