మేటాస్ మెట్రో కాంట్రాక్టు రద్దు
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ రామలింగరాజు కుమారుడికి చెందిన మేటాస్ కు ఇచ్చిన మెట్రో రైలు ప్రాజెక్టు కాంట్రాక్టును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. మేటాస్ కు ఇచ్చిన అనుమతులన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. మెట్రో రైలు ప్రాజెక్టుపై ఈ నెల 13వ తేదీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రి రాంనారాయణ రెడ్డి చెప్పారు. మెట్రో రైలు ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
మార్చి 15వ తేదీ లోపల ఫైనాన్షియల్ రిపోర్టు ఇవ్వనందుకు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన 50 కోట్ల రూపాయలు చెల్లించనందుకు ప్రభుత్వం ఇప్పటికే మేటాస్ కు గడువు ఇచ్చింది. అయినా మేటాస్ స్పందించకపోవడంతో ప్రభుత్వం మేటాస్ తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.












Click it and Unblock the Notifications