కల్తీ మద్యానికి 26 మంది బలి
అహ్మదాబాద్: గుజరాత్ లోని అహ్మదాబాదులో కల్తీ మద్యం సేవించి 26 మంది మరణించారు. ఈ సంఘటనపై గుజరాత్ శాసనసభ బుధవారం అట్టుడికింది. హోంమంత్రి అమిత్ షా రాజీనామాను డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. తాము సమస్యను లేవనెత్తడానికి ప్రయత్నిస్తే అనుమతించలేదని, సంఘటనపై విచారణకు ఆదేశించి హోంమంత్రిని తప్పించాలని తాము డిమాండ్ చేస్తున్నామని కాంగ్రెసు నేత అర్జున్ మోద్వాడియా చెప్పారు.
కల్తీ మద్యం సేవించి 26 మంది మరణించడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. మజూరుకు చెందిన ఇద్దరు పోలీసు ఇన్ స్పెక్టర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఒధావ్ పోలీసు అసిస్టెంట్ కమిషనరును బదిలీ చేసింది.












Click it and Unblock the Notifications