122కు చేరిన కల్తీ మద్యం మృతులు
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో కల్తీ మద్యం సేవించి మరణించిన వారి సంఖ్య 122కు చేరింది. గత రాత్రి నుంచి మరో 9 మంది మరణించారు. ఇప్పటి వరకు 122 మంది మరణించినట్లు, మరో 227 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు పోలీసు అధికారులు శనివారం చెప్పారు.
నగరంలోని పలు చోట్ల కల్తీ మద్యం సేవించి మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. మంగళవారం తొలి మరణం వెలుగులోకి వచ్చింది. క్రైం బ్రాంచ్ కేసును దర్యాప్తు చేస్తోంది. ఖేడా జిల్లాలోని మెహందాబాద్ నుంచి ఈ కల్తీ మద్యం వచ్చినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్యను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ రాష్ట్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications