15 మంది గల భారత నౌక హైజాక్
ఎడెన్: సోమాలియా సముద్రపు దొంగలు మరోసారి తెగబడ్డారు. గల్ఫ్ ఆఫ్ సోమాలియా తీరంలో ఓ భారతీయ కోర్గో నౌకను సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. ఈ నౌకలో 15 మంది భారతీయులున్నారు. వారంతా నౌకా సిబ్బందే.
బొస్శాసోకు 14 నాటికన్ మైళ్ల దూరంలో ఈ నౌక హైజాక్ జరిగింది. ఈ నౌక రెగ్యులర్ గా సౌదీ అరేబియా, ఆఫ్రికా తీరాల మధ్య వస్తువులను రవాణా చేస్తుందని తెలుసోంది. ఈ నౌక హైజాక్ అయినప్పుడు పంచదారను రవాణా చేస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications