హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ ట్రాప్ లో బాబు: చిరు

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడులపై ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి శనివారం తీవ్రంగా ధ్వజమెత్తారు. చంద్రబాబు కాంగ్రెసు ట్రాప్ లో పడి ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బ తీస్తున్నారని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. పార్టీని బలోపేతం చేసుకోవడానికి చంద్రబాబు వలసలను ప్రోత్సహిస్తున్నారని, ఇది ఎన్నికలకు ముందు చేయాల్సిన పని అని ఆయన అన్నారు. అన్ని పక్షాలను ఏకం చేసి ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుదని, దాన్ని చంద్రబాబు విస్మరించారని ఆయన అన్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గడగడలాడించి ప్రజాసమస్యలు పరిష్కరించేలా చేయవచ్చునని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తీరును ఆయన తప్పు పట్టారు. ప్రజలు ఆకలితో మలమల మాడుతుంటే వైయస్ విహార యాత్రలు చేస్తున్నారని, జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారని ఆయన అన్నారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో వైయస్ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికి పూనుకున్నారని ఆయన అన్నారు. అస్థిరతను సృష్టించి ప్రతిపక్షాలు లేకుండా చేయాలని వైయస్ చూస్తున్నారని ఆయన అన్నారు. ప్రజాసమస్యలను లేవనెత్తకుండా ఆపరేషన్ ఆకర్ష్ ను అమలు చేస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై ఈ నెల 16వ తేదీ నుంచి ఆందోళనకు దిగనున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X