ఆస్ట్రేలియాపై భారత విద్యార్థులు ఆగ్రహం
మెల్బోర్న్: సామరస్య నడక సందర్భంగా తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడం పట్ల భారత విద్యార్థులు ఆస్ట్రేలియా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత విద్యార్థులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో బహుళ సంస్కృతి ప్రోత్సహానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం రేపు సామరస్య నడక కార్యక్రమాన్ని తలపెట్టింది. మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వకపోవడాన్ని బట్టి గత రెండు వారాలుగా భారత విద్యార్థుల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని అర్థమవుతోందని బారత విద్యార్థి సంఘాల సమాఖ్యం (ఫిసా) ఒక ప్రకటనలో అభిప్రాయపడింది.
అర్థవంతమైన చర్చకు తమను దూరం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, తాము బహుళ సంస్కృతిని బలపరుస్తామని, బాధితుల నుంచి సమస్యను పక్కదారి పట్టించే రాజకీయ నాయకుల ప్రయత్నాలను వ్యతిరేకిస్తామని ఫిసా అధ్యక్షుడు అమిత్ మెంఘాని అన్నారు.












Click it and Unblock the Notifications