అఫ్గాన్ లో 6గురు ఇండియన్స్ హత్య
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్ లోని ఒక నిర్మాణ సంస్థపై తాలిబాన్లు దాడి చేశారు. ఈ దాడిలో 18 మరణించినట్లు, వారిలో ఆరుగురు భారతీయులు ఉన్నట్లు పాకిస్తాన్ టీవీ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. తామే ఈ దాడికి పాల్పడ్డట్లు తాలిబాన్ ప్రకటించుకుంది. మృతుల్లో భారతీయులు, అఫ్గాన్లు, ఆఫ్రికన్లు ఉన్నట్లు తాలిబాన్ ప్రతినిధి తమకు ఫోన్ చేసి చెప్పాడని పాకిస్తాన్ టీవీ తెలిపింది. ఆ ప్రతినిధి తన పేరు చెప్పడానికి నిరాకరించాడు.
అయితే ఈ సంఘటనను అధికార వర్గాలు ధృవీకరించాల్సి ఉంది. చానెల్ దాడికి సంబంధించి వీడియోను ప్రసారం చేసింది. దాన్ని తాలిబాన్లు అందించినట్లు చెప్పింది. ఎకె 47 రైఫిళ్లతో, రాకెట్ లాంచర్లతో వారు దాడి చేసినట్లు ఫుటేజ్ చూస్తే తెలుస్తోంది. తాలిబాన్లు దాడి చేసింది భారత్ కు చెందిన కంపెనీ అని, అమెరికా కంపెనీకి అనుబంధంగా అది పనిచేస్తోందని తెలుస్తోంది. ఇస్లామ్ వ్యతిరేక కార్యకలాపాల వల్లనే తాము దాడి చేసినట్లు తాలిబాన్ ప్రతినిధి చెప్పాడు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications