హైదరాబాద్ కు కిరణ్ మృతదేహం

కార్గో విమానం శనివారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ మేరకు కిరణ్ మృతదేహాన్ని ఆరెపల్లికి తీసుకొచ్చేందుకు ఎస్పీ సజ్జనార్ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇందుకు హసన్‌పర్తి ఎస్సై కె.జనార్దన్ రెడ్డి, కిరణ్ సోదరుడు బుద్దె గణేష్, మరో ఇద్దరు బంధువులు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌కు బయలుదేరారు. వీరు హైదరాబాద్ లో ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. వాహనాన్ని సైతం సమకూర్చారు. శంషాబాద్ నుంచి అంబులెన్స్‌లో మృతదేహాన్ని శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆరెపల్లి గ్రామానికి తీసుకొస్తారు.












Click it and Unblock the Notifications