చిరంజీవి సిఫార్సు బుట్టదాఖలు

హైదరాబాద్ నివాసి నాగేంద్రబాబు శనివారం రెండు కల్యాణోత్సవ టికెట్ల కోసం చిరంజీవి నుంచి సిఫార్సు లేఖ తీసుకువెళ్లారు. తిరుమలలో దీన్ని తిరస్కరించినట్లు ఆయనద్వారా తెలుసుకున్న చిరంజీవి వెంటనే ఆదికేశవులుకు ఫోన్ చేశారు. వందలాది సిఫార్సు లేఖలను అనుమతించిన జే ఈవో, స్థానిక ఎమ్మెల్యేనైన తన లేఖను తిరస్కరించడం ఏమిటని వాపోయారు. అటుపైన తిరుమల జేఈవో ధర్మారెడ్డితో మాట్లాడారు. తిరస్కారాన్ని పొరపాటుగా భావించాలో, రాజకీయంగా పరిగణించాలో చెప్పాలని నిలదీశారు. ఇది భావ్యం కాదంటూ మండిపడ్డారు. అయితే ఇకపై ఇలా జరగనివ్వబోమని ఆయన హామీ ఇవ్వడంతో చిరంజీవి చల్లబడ్డారు.












Click it and Unblock the Notifications