ఒక కుటుంబం ఆత్మహత్య
గుంటూరు: దొంగతనం నేరం మోపారనే మనస్తాపంతో ఓ వ్యక్తి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా అమృతలూరులోని ఎస్టీ కాలనీకి చెందిన ఎందేటి సాంబశివరావు మంగళగిరిలోని ఓ మద్యం దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. అక్కడ జరిగిన ఓ దొంగతనం కేసులో యజమాని ఇతన్ని బాధ్యుడిని చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన సాంబశివరావు స్వగ్రామం అమృతలూరు వెళ్లి కూల్‌డ్రింకులో పురుగులమందు కలిపి తాను తాగి భార్య,ఇద్దరు పిల్లలకు తాగించాడు. దీంతో అంతా మృతి చెందారు.












Click it and Unblock the Notifications