న్యూఢిల్లీ: నక్సల్ సమస్యను ఎదుర్కొనడంలో విఫలమయ్యామని కేంద్ర హోంమంత్రి చిదంబరం అంగీకరించారు. మావోయిస్టుల వల్ల పొంచి ఉన్న ముప్పును అంచనా వేయడంలో ప్రభుత్వం పొరపడడంవల్లే సమస్యను ఎదుర్కొనడంలో వైఫల్యం ఎదురైందని ఆయన రాజ్యసభలో అన్నారు. 'ఇప్పుడు తీవ్రవాదం పెను సవాలుగా మారింది. ఆ సవాలుకు దీటుగా మేం సన్నద్ధమవుతున్నాం. అంతకు మించి వివరాలు ఇప్పుడు నేను బహిరంగంగా చెప్పడం సాధ్యపడదు' అని చిదంబరం అన్నారు. చాలాకాలంపాటు ఈ సమస్యను తక్కువ అంచనా వేయడం వల్లే సమస్య ఇంత తీవ్రత సంతరించుకుందని చిదంబరం అభిప్రాయపడ్డారు.