హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు అధికార పార్టీ మోసపూరిత విధానాలను అవలంభిస్తోందని ప్రజారాజ్యం ఆరోపించింది. ఆ పార్టీ నేత దేవేందర్‌గౌడ్ మాట్లాడుతూ వార్డుల విభజన, బీసీ ఓటర్ల లెక్కింపులో వారికి అనుకూలంగా ఉండే విధంగా చూసుకున్నారని విమర్శించారు. వీటన్నింటీని అధిగమించి తమ పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు సమాయత్తం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే గ్రేటర్ హైదరబాద్ సంబంధించి కమిటీల నిర్మాణం పూర్తయిందని తెలిపారు.