తిరుపతి: తనకు, ప్రజలకు మధ్య దూరం పెంచేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా కృషి చేస్తున్నారని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. తమ పార్టీలో అసంతృప్తి గురించి మీడియా లేనిపోని వార్తలు ప్రచారం చేస్తోందన్నారు. ఈ దుష్ప్రచారాన్ని ప్రజలే తిప్పికొట్టాలని కోరారు. ప్రతి ఒక్కరిని తాను వ్యక్తిగతంగా కలుసుకుని సమస్యలను పరిష్కరిస్తానన్నారు. అనంతరం పండ్ల వ్యాపారులతో సమావేశమైన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వినతిపత్రాలు తీసుకున్నారు.