న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి శనివారం 11 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి పార్టీ వ్యూహాన్ని సోనియాతో వైఎస్ చర్చించినట్లు సమాచారం. తర్వాత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిసే అవకాశం ఉంది.
అంతకు ముందు రాజశేఖర్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి చిదరంబరంతో ఈరోజు ఉదయం 9.15 గంటలకు సమావేశమయ్యారు. నక్సల్స్ సమస్యలపై చర్చించినట్లు తెలియవచ్చింది.