అందుకు టీడీపీతో కలుస్తా:చిరంజీవి
తిరుపతి :సమస్యల పరిష్కారానికి తెలుగుదేశంతో కలిసి పనిచేసేందుకు సిద్దమేనని తిరుపతి శాసనసభ్యుడు, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తెలిపారు.అలాగే తిరుపతి నగరంలో సమస్యల గుర్తింపునకు వంద మందితో చిరు సేవాదళం ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. తిరుపతి పర్యటనలో ఉన్న ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అనంతరం అక్కడ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేస్తామని ఆయన వెల్లడించారు.అభ్యర్థుల ఎంపికను వారం రోజుల్లో పూర్తిచేస్తామన్నారు.నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించే వరకు పీఆర్పీ పోరాటం కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు.












Click it and Unblock the Notifications