ఇవియంలతోనే గ్రేటర్ ఎన్నికలు: ఎవియస్
హైదరాబాద్: ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాల (ఇవియంల) ద్వారానే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎవియస్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై చర్చించడానికి ఆయన మంగళవారం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఇవియంలపై ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం తెలిపాయి. అయితే బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని, ఇవియంల ద్వారానే నిర్వహిస్తామని ఎవియస్ రెడ్డి సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
రంజాన్, వినాయక చవితి వంటి పండుగలను దృష్టిలో పెట్టుకుని ఆగస్టు 31వ తేదీ లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుందని ఆయన చెప్పారు. అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని 50 వేల రూపాయల నుంచి 2 లక్షల రూపాయలకు పెంచినట్లు ఆయన తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవి ఓపెన్ కెటగిరీలోనే ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications