ఇసి ఆఫీస్ వద్ద పిఆర్పీ ప్రదర్శన
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట ప్రదర్శన నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ రిజరేషన్లలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వాటిని సరి చేయాలని డిమాండ్ చేస్తూ వారు ఈ ప్రదర్శన చేశారు. ఇసి కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు వారు ప్రయత్నించారు. వార్గుల పునర్విభజనలోనూ రిజర్వేషన్ల ఖరారులోనూ అక్రమాలు జరిగాయని వారు ఆరోపించారు.
ఆందోళనకారులు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సమయంలో ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసి గాంధీనగర్ పోలీసు స్టేషనుకు తరలించారు. వీరు ఆందోళన చేస్తున్న సమయంలో ఎన్నికల సంఘం కార్యాలయంలో అఖిల పక్ష సమావేశం జరుగుతోంది.












Click it and Unblock the Notifications