మరో ఏడుగురికి స్వైన్ ఫ్లూ
హైదరాబాద్: హైదరాబాద్ లోని ఎర్రగడ్డ ఛాతీ వ్యాధుల ఆస్పత్రిలో బుధవారం ఐదు స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 17న ఫిలడెల్ఫియా నుంచి వచ్చిన 25 ఏళ్ల మహిళతో పాటు ఆమె ఐదేళ్ల కుమారునికి 20వ తేదీన లక్షణాలు బయటపడటంతో ఆస్పత్రిలో చేరారు. స్వైన్ ఫ్లూతో భారత్ కు వచ్చిన ఎనిమిదేళ్ల లండన్ బాలిక ద్వారా మరో బాలుడు, ఇద్దరు బాలికలకు వ్యాధి సోకింది. వైజాగ్ లో ఇద్దరికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు బుధవారం నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాధి సోకిన వారి సంఖ్య 50కి చేరింది.












Click it and Unblock the Notifications